లక్షణాలువార్తలు

2019 క్రికెట్ వరల్డ్ కప్: ఆస్ట్రేలియా జట్టు 15 మంది ఆటగాళ్ళ జాబితా

***

Advertisement

5 సార్లు ప్రపంచ కప్ ను గెలిచిన ఆస్ట్రేలియా తమ 15 మంది ఆటగాళ్ళ జాబితాను వెల్లడించింది. స్టీవెన్ స్మిత్ మరియు డేవిడ్ వార్నర్ బ్యాన్ తర్వాత ఎంతో సందిగ్ధంలో ఉన్న ఆ జట్టు, మొత్తానికి ఒక మంచి జట్టును ప్రకటించింది. గత కొన్ని నెలలుగా మంచి ప్రదర్శన తో ఆకట్టుకున్న హ్యండ్స్కంబ్ కు జట్టు లో చోటు దక్కలేదు. ఈ నిర్ణయం ఎన్నో సందేహాలకు దారి తీసింది. ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ లో తమ మొదటి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద జూన్ 1వ తేదీన ఆడనుంది.

Advertisement

జట్టు వివరాలు:

ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజ, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్తోయినిస్, అలెక్స్ క్యారీ (కీపర్), ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జై రిచర్డ్సన్, నాథన్ కుల్టర్- నైల్, జేసొన్ బెహ్రెన్డాఫ్, నాథన్ లైయన్, ఆడం జంపా.

Advertisement

జట్టు విశేషాలు:

  • స్టీవ్ స్మిత్ మరియు వార్నర్ వారి బ్యాన్ తర్వాత ఆడుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ప్రపంచ కప్ లోనే.
  • అలెక్స్ క్యారీ మాత్రమే ఆస్ట్రేలియా జట్టులో వికెట్ కీపర్.
  • వీరిలో వార్నర్, స్మిత్, ఫించ్, కమ్మిన్స్, స్టార్క్, మ్యాక్స్వెల్ మాత్రమే మునుపు ప్రపంచ కప్ ఆడారు.
  • స్టీవ్ స్మిత్ కు ఇది మూడవ ప్రపంచ కప్. అతను 2011, 2015 ప్రపంచ కప్ జట్లలో కూడా ఉన్నాడు.

Advertisement
Advertisement
Spread the love
Back to top button