లక్షణాలువార్తలు

2019 క్రికెట్ వరల్డ్ కప్: బంగ్లాదేశ్ జట్టు 15 మంది ఆటగాళ్ళ జాబితా

***

Advertisement

గత కొన్నేళ్లుగా మేటి జట్లకు గట్టి పోటీ ఇస్తున్న బంగ్లాదేశ్ జట్టు ఈ సారి జరగబోయే ప్రపంచ కప్ లో చోటు దక్కించుకుంది. ఆ జట్టు తమ 15 మంది ఆటగాళ్ళ జాబితాను,  సారధి గా మష్రఫే మోర్తాజా ను మంగళవారం నాడు (ఏప్రిల్ 16న ) ప్రకటించింది. టస్కిన్ అహ్మద్ కు జట్టు లో చోటు దక్కలేదు. అంతగా అంచనాల్లేని మోసద్దక్ హొస్సేన్ మరియు అబు జయెద్ లు జట్టు లో చోటు దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ తమ ప్రపంచ కప్ ను జూన్ 2వ తేదీన దక్షిణ ఆఫ్రికా జట్టు మీద ప్రారంభించనుంది.

Advertisement

జట్టు వివరాలు:

మష్రఫే మోర్తాజా (కెప్టెన్), తమిమ్ ఇక్బాల్, మహ్మదుల్ల, ముష్ఫికుర్ రహీమ్, షకిబ్ అల్ హసన్ (వైస్-కెప్టెన్), సౌమ్యా సర్కార్, లిటన్ దాస్, షబ్బీర్ రెహ్మాన్, మెహిది హాసన్, మోహమద్ మిథున్, రుబెల్ హోసేన్, ముస్తఫిజుర్ రెహ్మాన్, మోహమద్ సైఫ్ఉద్దీన్, మొసద్దెక్ హొస్సేన్, అబు జాయెద్.

Advertisement

జట్టు విశేషాలు:

  • తమిమ్ ఇక్బాల్ కు ఇది 4వ ప్రపంచ కప్.
  • లిటన్, మేహిది హాసన్, మోహమద్ మిథున్, ముస్తఫిజుర్ రెహ్మాన్, మోహమద్ సైఫ్ఉద్దీన్, మోసద్దెక్, మరియు అబు జయేద్ లకు ఇది తొలి ప్రపంచ కప్.
  • లిటన్ దాస్ జట్టు వికెట్ కీపర్ గా ఉంటాడు.
  • బంగ్లాదేశ్ జట్టు తమ మొదటి ప్రపంచ కప్ ను 1999 లో ఆడింది. ఇది ఆ జట్టుకు ఇది 6వ ప్రపంచ కప్.

Advertisement
Advertisement
Spread the love
Back to top button