లక్షణాలువార్తలు

2019 క్రికెట్ వరల్డ్ కప్: భారత జట్టు 15 మంది ఆటగాళ్ళ జాబితా

ప్రపంచ కప్ కు ఇంకా 45 రోజులు ఉంది అనగా బీసీసీఐ భారత ప్రపంచ కప్ జట్టును ప్రకటించింది. అందరూ భారత్ జట్టులో 4వ స్థానం లో ఎవరు ఆడతారా అనే సందిగ్ధంలో ఉన్నారు. చాలా రోజులుగా ఈ ప్రశ్నకు రాయుడు సమాధానం అని అందరూ అనుకోగా, బీసీసీఐ అతనిని అసలు టీం లోకి తీసుకోలేదు. ఇందుకు అతని అస్థిరమైన ప్రదర్శనలే ముఖ్య కారణం. అతనితో పాటు రిషబ్ పంత్ ను కూడా తీసుకోలేదు. రైనా మరియు యువరాజ్ ప్రపంచ కప్ ఆశలు పోయినట్టే.

Advertisement

జట్టు వివరాలు:
కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, ధోని (కీపర్), కేదార్ జాదవ్, హర్దిక్ పాండ్య, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తిక్, చహల్, కుల్దీప్, షమి, భువనేశ్వర్, బుమ్రా.

Advertisement

విశేషాలు:

  • వీరిలో కోహ్లీ, ధోని, ధవన్, జడేజా, రోహిత్, షమీ, భువనేశ్వర్, లు మాత్రమే మునుపు ప్రపంచ కప్ ఒక్కసారి అయినా ఆడారు.
  • ధోని కి ఇది 4వ ప్రపంచ కప్ కాగా, కోహ్లీ కి ఇది 3వది.
  • చీఫ్ సెలెక్టర్ ఎం. ఎస్ .కె ప్రసాద్ మాటలబట్టి , భారత జట్టు బ్యాటింగ్ లో 4వ స్థానం లో విజయ్ శంకర్ ఆడవచ్చు.

Advertisement
Advertisement
Spread the love
Back to top button