లక్షణాలు

గెలుపు-ఓటమి (మ్యాచ్ #34): ఢిల్లీ (DC) vs ముంబై (MI)

***

Advertisement

ఎప్పుడు ? ఎక్కడ ?

Advertisement

తేదీ: గురువారం ఏప్రిల్ 18, 2019

సమయం: రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం)

Advertisement

వేదిక: ఫిరోజ్ షా కోట్లా స్టేడియం , ఢిల్లీ

 

Advertisement

లెక్కలు తేలుద్దాం !!

ఇప్పటిదాకా ఐపీఎల్ లో  “ముంబై ఇండియన్స్” మరియు “ఢిల్లీ క్యాపిటల్స్” జట్లు 23 సార్లు తలబడ్డాయి. వాటిలో ముంబై జట్టు 11 సార్లు గెలవగా, ఢిల్లీ జట్టు 12 సార్లు  గెలిచింది.

Advertisement

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈ జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్ లలో ముంబై 3, ఢిల్లీ 6 సార్లు విజయాలు సాధించాయి.

ఈ సీజన్ లో వీరి మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఢిల్లీ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

 

గెలుపెవరిది ?

Advertisement

ముందుగా ఆతిథ్య జట్టు ఢిల్లీ విషయానికొస్తే తమ చివరి మూడు మ్యాచ్ లలో హ్యాట్రిక్ విజయాలతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో ఉంది. క్రితం సారి ముంబై తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన రిషబ్ పంత్, మరోసారి ఆ ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తున్నాడు. పృథ్వి షా, శిఖర్ ధావన్, కోలిన్ మన్రో లతో కూడిన టాప్-ఆర్డర్ బలంగా ఉంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మోరిస్, రబడ, అక్షర్ పటేల్ లతో పాటు గత మ్యాచ్ లో చెలరేగిన కీమో పాల్ లు బౌలింగ్ విభాగం లో కీలక ఆటగాళ్లు.

మరోవైపు ముంబై విషయానికొస్తే ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో ఐదు విజయాలతో లీగ్ లో మూడో స్థానంలో ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా రాణిస్తున్నప్పటికీ బ్యాట్ తో కూడా రాణించాల్సి ఉంది. డి కాక్, పొలార్డ్, హార్దిక్ పాండ్య లు అద్భుత ప్రదర్శనతో బ్యాటింగ్ లో సత్తా చాటుతున్నారు. గత మ్యాచ్ లో సూర్యకుమార్, ఇషాన్ కిషన్ లు కూడా ఫామ్ లోకి రావడం సానుకూలాంశం. కొత్త బంతితో బెహరెండోర్ఫ్  జట్టుకు శుభారంబాన్ని ఇవ్వగలుగుతున్నాడు. చివర్లో మలింగా, బుమ్రా ల రూపంలో నాణ్యమైన డెత్ బౌలర్లతో కూడిన ముంబై బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.

Advertisement

ఈ సీజన్లో సొంత గడ్డపై అంతగా రాణించనప్పటికీ, ఫామ్ దృష్ట్యా ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ మ్యాచ్ విజేత: ఢిల్లీ క్యాపిటల్స్

Advertisement
Advertisement
Spread the love
Back to top button