లక్షణాలు

గెలుపు-ఓటమి (మ్యాచ్ #6): కోలకతా (KKR) vs పంజాబ్ (KXIP)

లెక్కలు తేలుద్దాం !!

Advertisement

ఇప్పటిదాకా ఐపీఎల్ లో   “కింగ్స్ XI పంజాబ్”మరియు “కోలకతా నైట్ రైడర్స్”జట్లు 23 సార్లు తలబడ్డాయి. వాటిలో కోలకతా జట్టు 15 సార్లు గెలవగా, పంజాబ్ జట్టు 08 సార్లు గెలిచింది.

Advertisement

ఈడెన్ గార్డెన్స్ లో ఇరు జట్ల తలపడిన 10 మ్యాచులలో కోలకతా జట్టు 7 సార్లు గెలవగా, పంజాబ్ జట్టు 3 సార్లు గెలిచింది.

 

Advertisement

ఎప్పుడు ? ఎక్కడ ?

తేదీ : బుధవారం మార్చి 27, 2019

Advertisement

సమయం : రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం)

వేదిక : ఈడెన్ గార్డెన్స్ స్టేడియం , కోలకతా

Advertisement

 

గెలుపెవరిది ?

Advertisement

ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బలాబలాలు ఒక్కసారి చూద్దాం

హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో 17వ ఓవర్ దాకా గెలుపు కి అవకాశమే లేదనుకుంటున్న సమయం లో ఆండ్రూ రస్సెల్ అద్భుతమైన హిట్టింగ్ పుణ్యమా అని కోలకతా టోర్నమెంట్ లో తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. నితీష్ రానా కూడా చక్కగా ఆడాడు, వీరితో పాటు కార్తీక్, క్రిస్ లిన్ కూడా ఫామ్ లోకి వస్తే కోలకతా భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. వార్నర్ ధాటికో, మ్యాచ్  మధ్యలో నరైన్ చేతి వేలి గాయం వల్లనో గాని కార్తీక్ 8 మంది బౌలర్లను వాడాడు. ఈ మ్యాచ్ కి నరైన్ అందుబాటులో ఉండటం నైట్ రైడర్స్ బౌలింగ్ యూనిట్ కు ఎంతో కీలికం.

Advertisement

రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచినప్పటికీ, జనం ద్రుష్టి అంతా అశ్విన్-బట్లర్ ల మన్కడింగ్ సంఘటన వైపు మళ్లింది. అందువల్ల ఈ మ్యాచులో గెలిచి జట్టు బలాన్ని నిరూపించుకోవాల్సిన  అవసరం ఎంతయినా వుంది. 2018 లో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచులో రాహుల్ , గేల్ ల 116 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం వల్ల అలవోకగా గెలిచారు. ఈ మ్యాచ్ లో ఆండ్రూ టై ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి, అదే జరిగితే పంజాబ్ బౌలింగ్ మరికొంత బలపడినట్టే.

బ్యాటింగ్ లో కోలకతాది పైచేయి కాగా, బౌలింగ్ లో పంజాబ్ దే  పైచేయి. కానీ ఈడెన్ గార్డెన్స్ లో కోలకతా కి ఉన్న మంచి ట్రాక్ రికార్డు దృష్ట్యా , ఇవాళ మా ఓటు కోలకతాకే.

Advertisement

ఈ మ్యాచ్ విజేత : కోలకతా నైట్ రైడర్స్

Advertisement
Advertisement
Spread the love
Back to top button