ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటికి పదకొండు ఎడిషన్ లు జరిగాయి. ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్ల లో ఒకటి మన ఢిల్లీ క్యాపిటల్స్ అలియాస్ ఒకప్పటి డేర్ డెవిల్స్. ప్రతీ ఏటా సీజన్ మొదట్లో కాగితం మీద ఢిల్లీ జట్టు పులే , కానీ ఇప్పటికీ ఐపీఎల్ ఫైనల్ లో ఆడిన దాఖలాలు లేవు. క్రితం ఏడాది కూడా పాయింట్ల పట్టికలో టేబుల్ అట్టడుగున నిలిచింది.
ఐపీఎల్ ఢిల్లీ ఫ్రాంచైజ్ ఈ సంవత్సరం నుండి కొత్త పేరు, కోచింగ్ సిబ్బందిలో మార్పులు మరియు కొత్త ఆటగాళ్ల తో సరికొత్తగా ముస్తాబవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రాక తో గత కొన్ని సీజన్ల గా జట్టులో వున్న అనుభవలేమిని పూడ్చే అవకాశం దొరికింది.
ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ కు శ్రేయాస్ అయ్యర్ పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఢిల్లీ జట్టు గత చేదు జ్ఞాపకాలను తుడిచిపెట్టి, ఈ సీజన్లో తమ మొట్టమొదటి టైటిల్ కైవసం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు.
జట్టు సభ్యులు
బ్యాట్సమెన్ : శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, మంజోత్ కల్రా, కోలిన్ ఇంగ్రామ్ *, కోలిన్ మున్రో *.
బౌలర్లు: ట్రెంట్ బౌల్ట్ *, కగిసో రబాడా *, సందీప్ లామిచ్చానే *, రాహుల్ తేవాటియా, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, నాతు సింగ్, బండారు అయ్యప్ప.
ఆల్–రౌండర్స్: క్రిస్ మోరిస్ *, అక్షర్ పటేల్, కీమో పాల్ *, షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్ *, జలజ్ సక్సేనా, హనుమా విహారి.
వికెట్–కీపర్స్: రిషబ్ పంత్, అంకుష్ బెయిన్స్.
* విదేశీ ఆటగాడు
ఫామ్ లో ఉన్నదెవరు ?
-
శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు జరుగుతున్న 2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటిదాకా 10 ఇన్నింగ్స్ లో 60.5 బ్యాటింగ్ సగటు తో 484 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్ లో వున్నాడు.
-
ఇటీవలే ముగిసిన బిగ్ బాష్ లీగ్లో సందీప్ లామిచ్చానే 8 మ్యాచ్లలో 11 వికెట్లు పడగొట్టి 6.57 ఎకానమీ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు
Advertisement -
పృథ్వీ షా మరియు రిషబ్ పంత్ భారత జట్టు తరపున బాగా ఆడారు
తుది జట్టు లో ఆడబోయే XI
శిఖర్ ధావన్
పృథ్వీ షా
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్ )
రిషాబ్ పంత్ (కీపర్)
కోలిన్ ఇంగ్రామ్ *
క్రిస్ మోరిస్ *
అక్షర్ పటేల్
హర్షల్ పటేల్ / అవేష్ ఖాన్
అమిత్ మిశ్రా
ట్రెంట్ బౌల్ట్ *
కగిసో రబాడా * / సందీప్ లామిచ్చానే *
(విశ్రాంతి వల్ల గాని , గాయాల వల్ల గాని తుది జట్టు రూపు మారే అవకాశాలు వున్నాయి)
* విదేశీ ఆటగాడు